నవనీతచోరా నమో నమో అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics
Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: నవనీతచోరా నమో నమో

Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics


నవనీతచోర నమో నమో
నవమహిమార్ణవ నమో నమో ‖

హరి నారాయణ కేశవాచ్యుత శ్రీకృష్ణ
నరసింహ వామన నమో నమో |
మురహర పద్మ నాభ ముకుంద గోవింద
నరనారాయణరూప నమో నమో ‖

నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ
నగధర నందగోప నమో నమో |
త్రిగుణాతీత దేవ త్రివిక్రమ ద్వారక
నగరాధినాయక నమో నమో ‖

వైకుంఠ రుక్మిణీవల్లభ చక్రధర
నాకేశవందిత నమో నమో |
శ్రీకరగుణనిధి శ్రీ వేంకటేశ్వర
నాకజనననుత నమో నమో ‖
Share This :sentiment_satisfied Emoticon