చేరి యశోదకు అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu

Song/ Keerthana :: చేరి యశోదకు


Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics









చేరి యశోదకు శిశు వితడు
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు ‖

సొలసి చూచినను సూర్యచంద్రులను
లలి వెదచల్లెడులక్షణుడు |
నిలిచిననిలువున నిఖిలదేవతల
కలిగించు సురలగనివో యితడు ‖

మాటలాడినను మరియజాండములు
కోటులు వోడమేటిగుణరాశి |
నీటగునూర్పుల నిఖిలవేదములు
చాటువనూ రేటిసముద్ర మితడు ‖

ముంగిట జొలసిన మోహన మాత్మల
బొంగించేఘనపురుషుడు |
సంగతి మావంటిశరణాగతులకు
నంగము శ్రీవేంకటాధిపు డితడు ‖
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)