దాచుకో నీ పాదాలకు అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: దాచుకో నీ పాదాలకు


Get This Keerthana In English Script Click Here


Aarde Lyrics










రాగం: ఆరభి

దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి |
పూచి నీకీరీతిరూపపుష్పము లివి యయ్యా ‖


వొక్క సంకీర్తనె చాలు వొద్దికై మమ్ము రక్షించగ |
తక్కినవి భాండారాన దాచి వుండనీ |
వెక్కసమగునీ నామము వెల సులభము ఫల మధికము |
దిక్కై నన్నేలితి విక నవి తీరని నా ధనమయ్యా ‖

నానాలికపైనుండి నానాసంకీర్తనలు |
పూని నాచే నిన్ను బొగడించితివి |
వేనామాల వెన్నుడా వినుతించ నెంతవాడ |
కానిమ్మని నా కీపుణ్యము గట్టితి వింతేయయ్యా ‖

యీమాట గర్వము గాదు నీ మహిమే కొనియాడితిగాని |
చేముంచి నాస్వాతంత్ర్యము చెప్పినవాడగాను |
నేమాన బాడేవాడను నేరము లెంచకుమీ |
శ్రీమాధవా నే నీదాసుడ శ్రీవేంకటేశుడవయ్యా ‖


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)