దేవ దేవం భజే అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics
Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: దేవ దేవం భజే


Get This Keerthana In English Script Click Here


Aarde Lyrics


రాగం: ధన్నాసి


దేవ దేవం భజే దివ్యప్రభావం |
రావణాసురవైరి రణపుంగవం ‖

రాజవరశేఖరం రవికులసుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయం |
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం ‖

నీలజీమూత సన్నిభశరీరం ఘనవి-
శాలవక్షం విమల జలజనాభం |
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలనాధిపం భోగిశయనం ‖

పంకజాసనవినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనం |
లంకా విశోషణం లాలితవిభీషణం

వెంకటేశం సాధు విబుధ వినుతం ‖

Share This :sentiment_satisfied Emoticon