చక్కని తల్లికి అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics
Album :: Annamacharya Keerthanalu

Song/ Keerthana :: చక్కని తల్లికి


Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics
రాగం: పాడి
చక్కని తల్లికి చాంగుభళా తన
చక్కెర మోవికి చాంగుభళా ‖

కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు జూపులకు చాంగుభళా |
పలుకుల సొంపుల బతితో గసరెడి
చలముల యలుకకు చాంగుభళా ‖

కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెఱుగులకు చాంగుభళా |
ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా ‖

జందెపు ముత్యపు సరులహారముల
చందన గంధికి చాంగుభళా |
విందయి వెంకట విభుబెన చినతన
సంది దండలకు చాంగుభళా ‖

Share This :sentiment_satisfied Emoticon