నారాయణాయ నమో నమో అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: నారాయణాఅయ నమో నమో

Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics






నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో
యీరచనలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ‖

గోవిందాయ నమో నమో గోపాలాయ నమో నమో
భావజగురవే నమో నమో ప్రణవాత్మనే నమో నమో |
దేవేశాయ నమో నమో దివ్యగుణాయ నమో యనుచు
యీవరుసలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ‖

దామోదరాయ నమో నమో ధరణీశాయ నమో నమో
శ్రీమహిళాపతయే నమో శిష్టరక్షిణే నమో నమో |
వామనాయ తే నమో నమో వనజాక్షాయ నమో నమో
యీమేరలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ‖

పరిపూర్ణాయ నమో నమో ప్రణవాగ్రాయ నమో నమో
చిరంతన శ్రీ వేంకటనాయక శేషశాయినే నమో నమో |
నరకధ్వంసే నమో నమో నరసింహాయ నమో నమో
యిరవుగ నీగతి నెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ‖
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)