చిత్రం : బ్రహ్మ పుత్రుడు (1988)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : దాసరి
గానం : బాలు, సుశీల
సన్నజాజి సెట్టు కింద చలవా చలవా
చిన్నమ్మకెందుకింత గొడవ
సన్నజాజి సెట్టు కింద సలవా సలవా
చిన్నమ్మకెందుకింత గొడవ
దాని వయ్యారి రూపమెంత నడవా
అది గోదారి మీద గూటి పడవా
దాని తోడుంటే నాకు ఏం తక్కువ
ఓ..ఓ.. సన్నజాజి సెట్టు కింద సలవా సలవా
చిన్నాడి చేతికేమో చొరవ
సన్నజాజి సెట్టు కింద సలవా సలవా
చిన్నాడి చేతికేమో చొరవ
ఆడి ముద్దుకుంది ముత్యమంత విలవా
ఆడు ఉంటాడమ్మ గుండెలోన నిలవా
ఆడి కౌగిళ్ళకుంది ఎంత మక్కువ
సందేళ నింగిలోన సుక్కపొడిచి..
దాన్ని సందిళ్ళలోన ఈడు నిక్కబొడిచి
పిల్ల గాలి పైటలాగి పక్క పరిచి
అహ.. లేత ఎండ దాని మీద పూలు పరచి
దాని సోకు చూడగానే మైమరచి
నీడలాగ వెంటపడిపోదలచి
అందాలు ఇచ్చుకుంటా ఆకు మడచి
హోయ్.. సందిళ్ళకొచ్చిపోరా మావా
అరె.. గున్నమావితోటలోకి కన్నెపిల్ల రావే
సన్నజాజి సెట్టు కింద సలవా సలవా
చిన్నాడి చేతికేమో చొరవ
సన్నజాజి సెట్టు కింద సలవా సలవా
సిన్నమ్మకెందుకింత గొడవ
ఆడి ముద్దుకుంది ముత్యమంత విలువా
ఆడు ఉంటాడమ్మ గుండెలోన నిలవా
దాని తోడుంటే నాకు ఏం తక్కువ
హోహో.. సన్నజాజి సెట్టు కింద సలవా సలవా
సిన్నమ్మకెందుకింత గొడవ
కాశ్మీర లోయవంటి కన్నె సొగసు
కవ్వింత పూలు జల్లె ఉన్నవయసు
కన్యాకుమారి మీద నాకు మనసు
కంటిపాపాయి ఏమందో నాకు తెలుసు
మంచుపూల పందిరేసే మాఘమాసం
మాపటేళకొచ్చాను నీకోసం
నల్లమబ్బు చీకటొచ్చె మనకోసం
నాటాలి ముద్దుతో సందేశం
అరె..కంచెదాటి పోయింది చేను కూడా మావా
సన్నజాజి సెట్టు కింద సలవా సలవా
సిన్నమ్మకెందుకింత గొడవ
సన్నజాజి సెట్టు కింద సలవా సలవా
చిన్నాడి చేతికేమో చొరవ
దాని వయ్యారి రూపమెంత నడవా
అది గోదారి మీద గూటి పడవా
ఆడి కౌగిళ్ళకొస్తే ఎంత మక్కువ
సన్నజాజి సెట్టు కింద సలవా సలవా
సిన్నమ్మకెందుకింత గొడవ
సన్నజాజి సెట్టు కింద సలవా సలవా
చిన్నాడి చేతికేమో చొరవ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon