ఏనాడు అనుకోనిదీ పాట లిరిక్స్ | దొరలు దొంగలు (1976)

 


చిత్రం : దొరలు దొంగలు (1976)

సంగీతం : సత్యం

సాహిత్యం : మల్లెమాల

గానం : బాలు, సుశీల


ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ

ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ

వెల లేనిది... కల కానిది... ఇలలోన సరి రానిదీ

ఏనాడు అనుకోనిదీ... ఈనాడు నాదైనదీ


వెన్నెల పొదిగిన దొన్నెలు... కన్నులు

పెదవుల కందించనా.. పరవశమొ౦దించనా

అందం విరిసిన ఆమని వేళా

విందులు కొదవుండునా.. వింతలు లేకుండునా

ఊహూహూ..వేడుక.. వాడుక.. కాకుండునా...


ఏనాడు అనుకోనిదీ... ఈనాడు నాదైనదీ


కౌగిట అదిమి...  హృదయం చిదిమి

మధువులు కురిపించనా.. మదనుని మరిపించనా  

అందని స్వర్గం ముందు నిలిచితే

ఎందుకు పోమ్మ౦దునా.. ఇది వేళ కాదందునా

ఊహూహూ.. తీరిక.. కోరిక.. లేదందునా


ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ

వెల లేనిది.. కల కానిది.. ఇలలోన సరి రానిదీ

ఏనాడు అనుకోనిదీ...  ఈనాడు నాదైనదీ



Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)