సిత్తరాల సిరపడు సాంగ్ లిరిక్స్ అల వైకుంఠపురంలో (2019) తెలుగు సినిమా | Aarde Lyrics


Album : Ala Vaikunthapuramulo


Starring: Allu ArjunPooja Hegde
Music : Thaman S
Lyrics-Vijay Kumar Bhalla

Singers :Soorranna ,Saketh Komanduri

Producer: Allu Aravind - S. Radha Krishna
Director: Trivikram Srinivas
Year: 2019

English Script Lyrics CLICK HERE


సిత్తరాల సిరపడు సాంగ్ లిరిక్స్


సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు
పట్టుబట్టినాడ ఒగ్గనే ఒగ్గడు
పెత్తనాలు నడిపేడు చిత్తరాల సిరపడు
మంతనాలు చేసినాడు చిత్తరాల సిరపడు
ఊరూరు ఒగ్గేసినా ఉడుంపట్టు ఒగ్గడు
ఊరూరు ఒగ్గేసినా ఉద్దండుడు ఒగ్గడు

ఆఆఆఆ... ఆఆఆఆ...

బుగతోడి ఆంబోతు రంకేసి కుమ్మబోతె
బుగతోడి ఆంబోతు రంకేసి కుమ్మబోతె
కొమ్ములూడదీసి మరీ పీపలూదినాడురో

జడలిప్పి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే
జడలిప్పి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే
దెయ్యముతో కయ్యానికి తొడగొట్టి దిగాడు

ఆఆఆఆ... ఆఆఆఆ...

అమ్మోరి జాతరలో ఒంటితల రావణుడు
అమ్మోరి జాతరలో ఒంటితల రావణుడు
గుంటలెంట పడితేను గుద్ది గుండ సేసినాడు
గుంటలెంట పడితేను గుద్ది గుండ సేసినాడు

(వరదలో గుంటగాళ్ళు చిక్కుకోని బిక్కుమంటె
వరదలో గుంటగాళ్ళు చిక్కుకోని బిక్కుమంటె
ఈడీదుకుంటు పోయి ఈడ్చుకొచ్చినాడురో
ఈడీదుకుంటు పోయి ఈడ్చుకొచ్చినాడురో)

పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే
పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే
రొమ్ము మీదొక్కటిచ్చి కుమ్మికుమ్మి పోయాడు
రొమ్ము మీదొక్కటిచ్చి కుమ్మికుమ్మి పోయాడు

ఆఆఆఆ... ఆఆఆఆ...

పదిమంది నాగలేని పదిమూర్ల సొరసేప
పదిమంది నాగలేని పదిమూర్ల సొరసేప
ఒడుపుగా ఒంటిసేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు
ఒడుపుగా ఒంటిసేత్తో ఒడ్డుకట్టుకొచ్చినాడు

సాముసెసే కండతోటి దేనికైనా గట్టిపోటీ
సాముసెసే కండతోటి దేనికైనా గట్టిపోటీ
అడుగడుగు యేసినాడా అదిరేను అవతలోడు

సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు
ఉత్తరాన ఊరిసివర సిత్తరాల సిరపడు
గండుపిల్లి సూపులతో గుండెలోన గుచ్చాడు

సక్కనమ్మ ఎనకబడ్డ పోకిరోళ్ళ ఇరగదంతె
సక్కనమ్మ ఎనకబడ్డ పోకిరోళ్ళ ఇరగదంతె
సక్కనమ్మ కళ్ళల్లో యేలయేల సుక్కలొచ్చె
సక్కనమ్మ కళ్ళల్లో యేలయేల సుక్కలొచ్చె
Share This :sentiment_satisfied Emoticon