మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి పాట లిరిక్స్ | సాగర సంగమం (1982)

 చిత్రం : సాగర సంగమం (1982)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : వేటూరి

గానం : బాలు, జానకి


ఆఆఆఆఆఆఅ...

మౌనమేలనోయి...

మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి

మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి


ఎదలో వెన్నెల వెలిగే కన్నుల

ఎదలో వెన్నెల వెలిగే కన్నుల

తారాడే హాయిలో..

ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి

 


 

పలికే పెదవి వొణికింది ఎందుకో?

వొణికే పెదవి వెనకాల ఏమిటో?

కలిసే మనసులా.. విరిసే వయసులా

కలిసే మనసులా.. విరిసే వయసులా 

నీలి నీలి ఊసులు లేతగాలి బాసలు..

ఏమేమో అడిగినా 


మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి

 

హిమమే కురిసే చందమామ కౌగిట

సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట

ఇవి ఏడడుగుల వలపూమడుగుల

ఇవి ఏడడుగుల వలపూమడుగుల

కన్నె ఈడు ఉలుకులు కంటిపాప కబురులు...  

ఎంతెంతొ తెలిసిన


మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి

ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి

ఎదలో వెన్నెల ఆఆఆఅ వెలిగే కన్నుల

ఎదలో వెన్నెల ఆఆఆఅ వెలిగే కన్నుల

తారాడే హాయిలో..

ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి 

Share This :



sentiment_satisfied Emoticon