జయ జయ రామా అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics
Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: జయ జయ రామా


Get This Keerthana In English Script Click Here


Aarde Lyrics

జయ జయ రామా సమరవిజయ రామా |
భయహర నిజభక్తపారీణ రామా ‖


జలధిబంధించిన సౌమిత్రిరామా
సెలవిల్లువిరచినసీతారామా |
అలసుగ్రీవునేలినాయోధ్యరామా
కలిగి యజ్ఞముగాచేకౌసల్యరామా ‖

అరిరావణాంతక ఆదిత్యకులరామా
గురుమౌనులను గానేకోదండరామా |
ధర నహల్యపాలిటిదశరథరామా
హరురాణినుతులలోకాభిరామా ‖

అతిప్రతాపముల మాయామృగాంతక రామా
సుతకుశలవప్రియ సుగుణ రామా |
వితతమహిమలశ్రీవేంకటాద్రిరామా

మతిలోనబాయనిమనువంశరామా ‖Share This :sentiment_satisfied Emoticon