బ్రహ్మ కడిగిన పాదము అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics
Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: బ్రహ్మ కడిగిన పాదము


Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics

బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము దానె నీ పాదము ‖


చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము |
తలకగ గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము ‖

కామిని పాపము కడిగిన పాదము
పాముతల నిడిన పాదము |
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము ‖

పరమ యోగులకు పరి పరి విధముల
పరమొసగెడి నీ పాదము |
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమ పదము నీ పాదము ‖


Share This :sentiment_satisfied Emoticon