Album :: Annamacharya Keerthanalu
Song/ Keerthana :: అలరులు కురియగ
Get This Keerthana In English Script Click Here
Aarde Lyrics
రాగం: శంకరాభరణం
అలరులు గురియగ నాడెనదే |
అలకల గులుకుల నలమేలుమంగ ‖
అరవిరి సొబగుల నతివలు మెచ్చగ
అర తెర మరుగున నాడె నదే |
వరుసగ పూర్వదు వాళపు తిరుపుల
హరి గరగింపుచు నలమేలుమంగ ‖
మట్టపు మలపుల మట్టెలకెలపుల
తట్టెడి నడపుల దాటెనదే |
పెట్టిన వజ్రపు పెండెపు దళుకులు
అట్టిట్టు చిమ్ముచు నలమేలుమంగ ‖
చిందుల పాటల శిరిపొలయాటల
అందెల మ్రోతల నాడె నదే |
కందువ తిరువెంకటపతి మెచ్చగ
అందపు తిరుపుల నలమేలుమంగ ‖
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon