జయ లక్ష్మి వర లక్ష్మి అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics
Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: జయ లక్ష్మి వర లక్ష్మి


Get This Keerthana In English Script Click Here


Aarde Lyrics

రాగం: లలిత

జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి |

ప్రియురాలవై హరికి~ం బెరసితివమ్మా ‖


పాలజలనిధిలోని పసనైనమీ~ంగడ

మేలిమితామరలోని మించువాసన |
నీలవర్ణునురముపై నిండిననిధానమవై
యేలేవు లోకములు మమ్మేలవమ్మా ‖

చందురుతోడ~ం బుట్టిన సంపదలమెఱు~ంగవో

కందువ బ్రహ్మల~ం గాచేకల్పవల్లి |
అందినగోవిందునికి అండనే తోడునీడవై
వుందానవు మా^^ఇంటనే వుండవమ్మా ‖

పదియారువన్నెలతో బంగారుపతిమ

చెదరనివేదములచిగురు~ంబోడి |
యెదుట శ్రీవేంకటేశునిల్లాలవై నీవు
నిదుల నిలిచేతల్లి నీవారమమ్మా ‖
Share This :sentiment_satisfied Emoticon