Album :: Annamacharya Keerthanalu
Song/ Keerthana :: నానాటి బతుకు నాటకము
Get This Keerthana In English Script Click Here
Aarde Lyrics
రాగం: ముఖారి
నానాటి బతుకు నాటకము
కానక కన్నది కైవల్యము ‖
పుట్టుటయు నిజము, పోవుటయు నిజము
నట్టనడిమీ పని నాటకము |
యెట్టనెదుటి కలదీ ప్రపంచము
కట్ట గడపటిది కైవల్యము ‖
కుడిచేదన్నము కోక చుట్టెడిది
నడుమంత్రపు పని నాటకము |
వొడి కట్టుకొనిన ఉభయ కర్మములు
గడి దాటినపుడే కైవల్యము ‖
తెగదు పాపము, తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము |
ఎగువనే శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము ‖
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon