అలర చంచలమైన అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: అలర చంచలమైన


Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics











అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల |
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ‖



ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల |
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల ‖

పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల |
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల ‖

మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల |
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల ‖

పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల |
వోలి బ్రహ్మాండములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల ‖

కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల |
అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల ‖

కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల |
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల ‖
Share This :



sentiment_satisfied Emoticon