జగడపు చనువుల అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics
Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: జగడపు చనువుల


Get This Keerthana In English Script Click Here

Aarde Lyricsజగడపు చనువుల జాజర
సగినల మంచపు జాజర ‖


మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున |
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై
చల్లే రతివలు జాజర ‖

భారపు కుచముల పైపై కడు సిం-
గారము నెరపేటి గంధవొడి |
చేరువ పతిపై చిందగ పడతులు
సారెకు చల్లేరు జాజర ‖

బింకపు కూటమి పెనగేటి చెమటల
పంకపు పూతల పరిమళము |
వేంకటపతిపై వెలదులు నించేరు
సంకుమ దంబుల జాజర ‖

Share This :sentiment_satisfied Emoticon