చిత్రం : చిలిపిమొగుడు (1981)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, సుశీల
నిన్న సంధ్య వేళ కలల సందడి తోచెనులే
మల్లెల గుండెలలో ఎవరో పల్లవి పాడెనులే
తలపే బంధము కోరెనులే ..
ముచ్చటలూరించే కోటీ ముద్దుల మురిపించే..
ముచ్చటలూరించే కోటీ ముద్దుల మురిపించే..
తేనెల తేలించే ఎదలో రాగం పల్లవించే
ఊహల వయ్యారం నన్నొక బొమ్మగ ఊగించే ..
ఆశలు పండించే నాలో యవ్వనమూరించే
నిన్న సంధ్య వేళ కలలో సందడి తోచెనులే
మల్లెల గుండెలలో ఎవరో పల్లవి పాడెనులే..
తలపే బంధము కోరెనులే
పట్టు పైట తొలిగి మదిలో వేడుక పూరించే
పడచుదనం వగలై తెలిపే భావం పలకరించే..
అల్లరి నా మనసే చెలికి అల్లన విన్నవించే..
మోజులు వెన్నెలగా.. మోజులు వెన్నెలగా..
నిలిపే ఊహుహుఊహుహుహూ..
నిన్న సంధ్య వేళ కలలో సందడి తోచెనులే
మల్లెల గుండెలలో ఎవరో పల్లవి పాడెనులే
తలపే బంధము కోరెనులే..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon