కట్టెదుర వైకుంఠము అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics






Album :: Annamacharya Keerthanalu

Song/ Keerthana :: కట్టెదుర వైకుంఠము


Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics






కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టలాయ మహిమలే తిరుమల కొండ ‖

వేదములే శిలలై వెలసినది కొండ
యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ |
గాదిలి బ్రహ్మాది లోకముల కొనలు కొండ
శ్రీదేవు డుండేటి శేషాద్రి కొండ ‖


సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ |
వుర్వి దపసులే తరువులై నిలచిన కొండ
పూర్వ టంజనాద్రి యీ పొడవాటి కొండ ‖

వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ
పరగు లక్ష్మీకాంతు సోబనపు గొండ |
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైన దదివో శ్రీ వేంకటపు గొండ ‖
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)