విడిపోము మనము (కళ్యాణ వైభోగమే) సాంగ్ లిరిక్స్ సీతారామ కళ్యాణం (1986) తెలుగు సినిమా | Aarde Lyrics

Album : Seetharama Kalyanam


Starring: Nandamuri Balakrishna, Rajani
Music : K. V. Mahadevan
Lyrics-Aatreya
Producer: K. Murari
Director: Jandhyala
Year: 1986

Telugu Script Lyrics Click Here





విడిపోము మనము (కళ్యాణ వైభోగమే) సాంగ్ లిరిక్స్



విడిపోము మనము
ఈ ఎడబాటు క్షణము
ఆ పైన కళ్యాణము

కళ్యాణ వైభోగమే...
కళ్యాణ వైభోగమే
శ్రీసీతారాములకళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే
శ్రీసీతారాములకళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే

అనుకున్న కొన్నాళ్ళ వనవాసము
మునుముందు కావాలి మధుమాసము
అనుకున్న కొన్నాళ్ళ వనవాసము
మునుముందు కావాలి మధుమాసము
మన ప్రేమ తుదిలేని ఆకాశము
మన ప్రేమ తుదిలేని ఆకాశము
ప్రతిరోజు పూర్ణిమ శ్రావణము

కళ్యాణ వైభోగమే
శ్రీసీతారాములకళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే

మరులెల్ల మరుమల్లె విరిమాలగా
మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా
మరులెల్ల మరుమల్లె విరిమాలగా
మురిపాల ముత్యాలే తలంబ్రాలుగా
హృదయాల నాదాలే వేదాలుగా
హృదయాల నాదాలే వేదాలుగా
మన అంతరంగాలే వేదికగా

కళ్యాణ వైభోగమే

వలచాము నిలిచాము ఒక దీక్షగా
మనసైన మనసొకటే సాక్షిగా
వలచాము నిలిచాము ఒక దీక్షగా
మనసైన మనసొకటే సాక్షిగా
గెలిచాము కలిసాము దివిమెచ్చగా
ఆ ఆ ఆ ఆ ఆ
గెలిచాము కలిసాము దివిమెచ్చగా
కలకాలముందాము నులివెచ్చగా

కళ్యాణ వైభోగమే
శ్రీసీతారాములకళ్యాణమే
మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే  

Share This :



sentiment_satisfied Emoticon