మూసిన ముత్యాల కేలే మొరగులు అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde LyricsAlbum :: Annamacharya Keerthanalu

Song/ Keerthana :: మూసిన ముత్యాల కేలే మొరగులు

Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics
మూసిన ముత్యాల కేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు ‖

కందులేని మోమున కేలే కస్తూరి
చిందు నీ కొప్పున కేలే చేమంతులు |
మందయానమున కేలే మట్టెల మోతలు
గంధమేలే పైపై కమ్మని నీ మేనికి ‖


భారపు గుబ్బల కేలే పయ్యెద నీ
బీరపు జూపుల కేలే పెడమోము |
జీరల భుజాల కేలే చెమటలు నీ
గోరంట గోల్ల కేలే కొనవాండ్లు ‖

ముద్దుల మాటల కేలే ముదములు నీ
యద్దపు జెక్కుల కేలే అరవిరి |
వొద్దికమాటల కేలే వూర్పులు నీకు
నద్దమేలే తిరు వేంకటాద్రీశు గూడి ‖

Share This :sentiment_satisfied Emoticon