చిత్రం : సర్పయాగం (1991)
సంగీతం : విద్యాసాగర్
సాహిత్యం : సినారె
గానం : బాలు
చుక్కా చుక్కా కన్నీటి చుక్కా చెక్కిట జారొద్దు
నా చిన్నారి పాపా నీ కన్నుల్లో చీకటి వాలొద్దు
అమ్మ నీకు కావాలంటే అంగడిలో కొనితేలేను
అమ్మ నీకు కావాలంటే అంగడిలో కొనితేలేను
నేనే నీ అమ్మనుకుంటే ప్రాణం హారతి పడతాను
బ్రతుకే పండిందంటాను.
చుక్కా చుక్కా కన్నీటి చుక్కా చెక్కిట జారొద్దు
నా చిన్నారి పాపా నీ కన్నుల్లో చీకటి వాలొద్దు.
జరిగిన కాలం ఏనాడైనా తిరిగి రాగలిగేనా...ఓ.
జరిగిన కాలం ఏనాడైనా తిరిగి రాగలిగేనా...
నేలకు రాలిన ధృవతారైనా నింగికి పోగలిగేనా
శ్వాసకు హద్దు ఉన్నది గాని ఆశకు లేదమ్మా
కాటిలో కలిసిన ఏ ప్రాణైనా గూటికి రానే రాదమ్మా...
చుక్కా చుక్కా కన్నీటి చుక్కా చెక్కిట జారొద్దు
నా చిన్నారి పాపా నీ కన్నుల్లో చీకటి వాలొద్దు
ఇంతగ ఉన్న నా పసిగున్నా ఎంతగా ఎదిగావమ్మా...ఆ..
ఇంతగ ఉన్న నా పసిగున్నా ఎంతగా ఎదిగావమ్మా.
ఒదిగే కళ్ళల్లో ఊరేగే బిడియం ఓణీ వేసిందమ్మా...
నీ నవ్వుల్లో మీ అమ్మ రూపం నిత్యంకంటాను.
నూరేళ్లయినా నిన్నే చూస్తూ మారాజల్లే ఉంటాను.
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon