ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి
ఓ పిచ్చిపిల్లా తెల్లారెనమ్మా
ఓపిక తో నిదురింక చాలించి లెమ్మా
చాలించి లెమ్మా
కీచు కీచుమని భరద్వాజమ్ములూ
కిలకిల ధ్వనులతో ఏవేవో పిలుపులు
పగలైతే కలవమనీ తెలిపేటీ కులుకులు
మగువరో వినలేదా ఆ చిలుక పలుకులు
విరులన్నీ కురులనూ విడిచి పోయినా గానీ
మరుమల్లె వాసనలా మత్తు విడిపోనీ
గొల్ల పడుచులు చల్ల చిల్కగా ఆఆఆఆ
కంకణ కంఠ హారమ్ములా ధ్వనులు వినలేదా
అన్ని వస్తువులందు హత్తుకొని ఉండియు
కన్నులకు మనకెప్పుడు కనపడుచూ ఉండు
ఆ కన్నయ్యగా పుట్టి హతమార్చె దుష్టులను
విన్నవించినవన్నీ వినుచూ నిదురింతువా
నీకు న్యాయమా ఇదీ ఓ నాయకీమణి
నీ అందచందాలూ నిగ్గులనూ చూపుటకూ
ఆ స్వామికి అడ్డముగా అటుమళ్ళబోకు
తెరవమ్మా ద్వారమును తిమిరమంతమూ చేయగా
ఓ పిచ్చిపిల్లా తెల్లారెనమ్మా
ఓపిక తో నిదురింక చాలించి లెమ్మా
చాలించి లెమ్మా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon