మాయతొ గూడి ఉత్తర మధురన్ పుట్టి పాట లిరిక్స్ | గోదా గీత మాలిక

 ఆల్బం : గోదా గీత మాలిక

సంగీతం : రాధా గోపి

సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్

గానం : వాణీజయరాం 

 

మాయతొ గూడి ఉత్తర మధురన్ పుట్టి

తల్లినలరించి యమునను దాటి వచ్చి

అచట రేపల్లె మణి దీపమై తనర్చి

తల్లి త్రాట గట్టగా

 

దామముదరమందు దాల్చి

దామోదరుండైన కృష్ణు శుచులమై

మంచి అలరుల సరిది గొల్చి

పలికి నోరారా పాపముల్ పారిపోయి 


అగ్నిలోన పడ్డ దూదియై అంతరించు

అగ్నిలోన పడ్డ దూదియై అంతరించు


Share This :



sentiment_satisfied Emoticon