ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి
మాయా మానుష మంజుల రూపుని
మర్మము కనుగొన మగువలు రండి
తల్లి యశోద త్రాడుతొ కట్టగా
ముల్లోకనాథుడు ముందుకెళ్ళగా
ముసి ముసి నగవుల ముద్దు లొలకగా
పసి బాలకృష్ణుని పదములంటగా
సొగసులు చిలికెడి మధురా నగరిలో
సుందర యమునా తటి సీమలలో
కాళీయునిపై కాలుని మోపి
కేళిని సలిపిన లీలా లోలుని
పరిమళమొలికెడి పరి పరి విధముల
విరి కన్నెలతో జరిపిన పూజల
పాపాలు దహియించు ప్రత్తిలా తృటిలో
అజ్ఞానమంతమై విజ్ఞానమొసగే
మాయా మానుష మంజుల రూపుని
మర్మము కనుగొన మగువలు రండి
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon