చిత్రం : సింధూరం (1998)
సంగీతం : శ్రీ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కృష్ణరాజ్, ప్రదీప్, మాధవపెద్ది
ఏడు మల్లెలెత్తు సుకుమారికి
ఎంత కష్టం వచ్చింది నాయనో
భోగి పళ్ళు పొయ్యాలి బేబికి
ఏమి దిష్టికొట్టింది నాయనో
ముగ్గులెట్టు ముచ్చట్లలో
ముచ్చెమట్లు పట్టాయిరో
మంచుబొట్లు ఆ బుగ్గలో
అగ్గి చుక్కలైనాయిరో
ఏ..ముగ్గులెట్టు ముచ్చట్లలో
ముచ్చెమట్లు పట్టాయిరో
మంచుబొట్లు ఆ బుగ్గలో
అగ్గి చుక్కలైనాయిరో
పాతమంచమిదిగో పట్టుకొచ్చినానురో
భగ్గుమంటు మండుతాదిరో
పేకతల్లిరో పీకులాడమందిరో
సందు చూసి సద్దుకోరో హోయ్
బోడిజుట్టు ఉందని కోడిపుంజు
కావురో కాలుదువ్విరాకయ్యో
ఎక్కిరించనా ఎంతచక్కగుంటవే
నా పడచు పావురాయో
అలా మాయమాటలాడితే ఐసైపోనయ్యా
బలాదూరు మానకుంటే
భరతం పడతడు మా మామయ్య
హరిలో రంగా హరీ చూడరో దీనల్లరి
గాదెలో నిండే వరి వీధిలో చిందే సిరి
సువ్వి సువ్వి గొబ్బిళ్ళ పాటకి
నవ్వి నవ్వి తాళాలు వెయ్యరో
ఎంత గోల పెట్టినా నెత్తి మీదకొచ్చెరో
కుంకుడు స్నానాలు
చింత మొద్దులా అంతనిద్దరేందిరా
ఏమాయె పౌరుషాలు
ఎముకలు కొరికే ఈ చలిపులిని
చెమటలు కక్కించరో
అహ మంచుగడ్డిలా ఉన్నరేయిని
మంటపాలు చెయ్యిలేరో
ప్రతి ఇంట బూరెల వంట
మహబాగుంది సరే
కనుం దాకా కక్కా ముక్కా
దొరకదు అది ఒక లోటే కదరో
సంకురాత్రి పండగొచ్చెరో
సంబరాలు తెచ్చేనురో
గంగిరెద్దు ఇంటకొచ్చెరో
గంగడోలు దువ్వి పంపరో
తెలుగింట లోగిళ్ళలోనికి
పెద్దపండగొచ్చింది చూడరో
కిల కిల సందళ్ళతో ఇలా
కొత్తపొద్దు తెచ్చింది చూడరో
సంకురాత్రి పండగొచ్చెరో
సంబరాలు తెచ్చేనురో
గంగిరెద్దు ఇంటకొచ్చెరో
గంగడోలు దువ్వి పంపరో
హే..సంకురాత్రి పండగొచ్చెరో
సంబరాలు తెచ్చేనురో
గంగిరెద్దు ఇంటకొచ్చెరో
గంగడోలు దువ్వి పంపరో
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon