చిత్రం : అయ్యప్పస్వామి మహత్యం (1989)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు
స్వామియే శరణమయ్యప్పా
స్వామియే శరణమయ్యప్పా
శబరిమలై సందీపా అయ్యప్పా
అభయహస్తమిచ్చేదెవరూ
నువ్వుతప్పా అయ్యప్పా
శబరిమలై సందీపా అయ్యప్పా
అభయహస్తమిచ్చేదెవరూ
నువ్వుతప్పా అయ్యప్పా
శబరిమలై సందీపా అయ్యప్పా
వేద శాస్త్రము ఎరుగను
బ్రహ్మ సూత్రమూ
తలపను జ్ఞాన యోగము
విధి విహిత మోక్ష మార్గము
కలియుగపు కామ లోభ
పంజరాన పామరుండనై
పూజ లెరుగని పూవునై
పుణ్యమెరుగని జీవినై
ఆత్మనెరుగని దేహినై
అంధమత సందేహినై
విషయవాసనల
విష తరువైతిని
విలయ పవనముల
విల విల లాడితి
శబరిమలై సందీపా అయ్యప్పా
అభయహస్తమిచ్చేదెవరూ
నువ్వుతప్పా అయ్యప్పా
శబరిమలై సందీపా అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్పా
ఇంద్రియాలతో తలబడి
ఈషణ త్రయి కలుషిత జీవభారమే
కడదనుక మోయువాడనై
శబరిగిరి కందరాలనందలేని
మంద భాగ్యునై
చైత్రవనమున కాకినై
గ్రీష్మ రుతువున కోకిలై
వెన్నుడూదని వేణువై
వెన్ను చూడని కన్నునై
మనుజ జన్మమిటు
మలినము జేసితి
మదన కదనముల
మల మల మాడితి
శబరిమలై సందీపా అయ్యప్పా
అభయహస్తమిచ్చేదెవరూ
నువ్వుతప్పా అయ్యప్పా
శబరిమలై సందీపా అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్పా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon