చిత్రం : స్వామి అయ్యప్ప (1993)
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథం
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : వాణీజయరాం, ఎస్.పి.శైలజ, స్వర్ణలత
స్వామి అయ్యప్ప కథను తెలియండీ
ఆ పుణ్య నామముని తలవండీ
త్రిపురాసుర సంహారం చేసిన ఆ శంకరుడే
భక్తుల కావగా అయ్యప్పగ వెలిశాడు
త్రిపురాసుర సంహారం చేసిన ఆ శంకరుడే
భక్తుల కావగా అయ్యప్పగ వెలిశాడు
స్థితి కంఠుడు భువిలోనా
నేడు మణికంఠుడు ఐనాడు
కన్నియల కన్నులకు కనిపించుని కృష్ణునిగా
చిన్నెలను చిందించే మోహినీ రూపానా
కన్నియల కన్నులకు కనిపించుని కృష్ణునిగా
చిన్నెలను చిందించే మోహినీ రూపానా
నటనమాడు శౌరీ అది శబరి గిరిని చేరీ
స్వామి అయ్యప్ప కథను తెలియండీ
ఆ పుణ్య నామముని తలవండీ
మదనుని సుమ బాణములను
మసి చేసెను మోహములను
హరిహర సంగమమౌ
అద్భుత అవతారముగా
హరిహర సుతుడే వెలసెను
అయ్యప్పా అను పేరా
అయ్యప్పా అను పేరా....
దైవలీల ధరణి పైన చూపిన పరిపాలకుడు
మానవుల కరుణించగ వచ్చె దివ్య బాలకుడు
వచ్చె దివ్య బాలకుడు
శివవిష్ణు బేధముల తొలగించిన దీపం
దీవెనగా ఇచ్చినాడు మోహన సంగీతం
స్వామి అయ్యప్ప కథను తెలియండీ
ఆ పుణ్య నామముని తలవండీ
వేటలాడ వేడుకగా వచ్చే రాజు అడివికి
పంపానది తీరమందు సేద తీరె తానలసీ
పందళ మహరాజు కాంచె పసికందునచ్చట
సుతులు లేని కొరత తీర శివుడొసగిన హేళ
ప్రీతి తీర చేకొనే పుత్రుని ఓలే
మణికంఠుడి నామం మహినేలెడి గుణథామం
రాణి కన్నదొక్క సుతునీ
రాజు చేయ తలచేనతనీ
పెంచుకున్న బిడ్డను కూడా
చంపుకొనగసిద్దపడెను
రాచరికపు దాహం అది నీచమౌ వ్యామోహం
పెంచిన తన తల్లికి శిరోవేదన తొలగింప
పులి పాలను తెచ్చుటకై వెడలినాడు కారడవికి
స్వామి వనికి చేరా అటకు దేవతలే దిగివచ్చారు
యుద్దమందు స్వామినరసి
కూలిపోయె దుష్టమహిషీ
చెంత చేరి రతీదేవి స్వామి మీద ఆశపడ్డాదు
మానిని తిరుత్తమకు తపమే ఇక ముగిసినది
పులిపాలను కోరిననే తనకు తానుగా
బెబ్బులి అణకువగా పందళకే వచ్చినదీ
ఊరంతా భయపడుతూ బెదిరి పోయినదీ
అది చూసీ
సురవినుత హరిహరసుత సుందర వదనారవిందా
నీదు చిరునగవు వెలుగులతో శబరి గిరి ధన్యమైనదీ
అయ్యప్పా నీ రూపం గుండెలలోమణిదీపం
అయ్యప్పా నీ రూపం గుండెలలోమణిదీపం
స్వామియే అయ్యప్పా అయ్యప్పో స్వామియే
స్వామియే అయ్యప్పా అయ్యప్పో స్వామియే
స్వామియేయ్.. శరణమయ్యప్పా...
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon