స్వామీ శరణం శరణము అయ్యప్ప పాట లిరిక్స్ | స్వామి అయ్యప్ప (1975)

 చిత్రం : స్వామి అయ్యప్ప (1975)

సంగీతం : దేవరాజన్

సాహిత్యం : జె.జె.మాణిక్యం, విశ్వనాథం

గానం : బాలు


స్వామీ శరణం శరణము అయ్యప్ప

హరిహర సుతవో పావన చరిత

భక్తమందారా భవ పరిహారా

కరుణతో మమ్ము కావుము అయ్యప్ప


స్వామీ శరణం శరణము అయ్యప్ప

హరిహర సుతవో పావన చరిత

భక్తమందారా భవ పరిహారా

కరుణతో మమ్ము కావుము అయ్యప్ప


ముడుపులు కట్టి శిరమున దాల్చి

మ్రొక్కులు తీర్చెదమయ్యా..

నీవే దిక్కని వేడెదమయ్యా..


ముడుపులు కట్టి శిరమున దాల్చి

మ్రొక్కులు తీర్చెదమయ్యా..

నీవే దిక్కని వేడెదమయ్యా..


దర్శన మొందా.. ధన్యత పొందా

తరలీ వచ్చెదమయ్యప్పా

దర్శన మొందా.. ధన్యత పొందా

తరలీ వచ్చెదమయ్యప్పా


అయ్యప్పా స్వామీ అయ్యప్పా..

అయ్యప్పా స్వామీ అయ్యప్పా

అయ్యప్ప దిందడతోం.. అయ్యప్పో స్వామి దిందడతోం..

స్వామి దిందడతోం.. అయ్యప్పో అయ్యప్ప దిందడతోం

అయ్యప్ప దిందడతోం.. అయ్యప్పో స్వామి దిందడతోం..

స్వామి దిందడతోం.. అయ్యప్పో అయ్యప్ప దిందడతోం

అయ్యప్ప దిందడతోం.. అయ్యప్పో స్వామి దిందడతోం..

స్వామి దిందడతోం.. అయ్యప్పో అయ్యప్ప దిందడతోం


స్వామియే.... శరణమయ్యప్పా..

శరణమయ్యప్పా.. శరణమయ్యప్పా..


స్వామీ శరణం శరణము అయ్యప్ప

హరిహర సుతవో పావన చరిత

భక్తమందారా భవ పరిహారా

కరుణతో మమ్ము కావుము అయ్యప్ప


అళుదానదిలో మునిగి

రెండు రాళ్ళను చేతితో తీసి

నిండు భక్తితో గుట్టపై నుంచి

అళుదానదిలో మునిగి

రెండు రాళ్ళను చేతితో తీసి

నిండు భక్తితో గుట్టపై నుంచి


కరిమల చేరి.. కరములుమోడ్చి..

ఆనంద ముప్పొంగ పాడుదాం

కరిమల చేరి.. కరములుమోడ్చి..

ఆనంద ముప్పొంగ పాడుదాం


అయ్యప్పా స్వామీ అయ్యప్పా..

అయ్యప్పా స్వామీ అయ్యప్పా


స్వామీ శరణం శరణము అయ్యప్ప

హరిహర సుతవో పావన చరిత

భక్తమందారా భవ పరిహారా

కరుణతో మమ్ము కావుము అయ్యప్ప


పంపను చేరి ఆశలు మీరి..

భక్తితో నిన్నే తలచి

నదిపై జ్యోతులనే వెలిగించి..

పంపను చేరి ఆశలు మీరి..

భక్తితో నిన్నే తలచి

నదిపై జ్యోతులనే వెలిగించి..


శబరి పీఠం చూసి శరముల గ్రుచ్చి..

నీ కీర్తి నెలుగెత్తి చాటుతాం

శబరి పీఠం చూసి శరముల గ్రుచ్చి..

నీ కీర్తి నెలుగెత్తి చాటుతాం


అయ్యప్పా స్వామీ అయ్యప్పా..

అయ్యప్పా స్వామీ అయ్యప్పా


స్వామీ శరణం శరణము అయ్యప్ప

హరిహర సుతవో పావన చరిత

భక్తమందారా భవ పరిహారా

కరుణతో మమ్ము కావుము అయ్యప్ప


ప్రతి ఏడాది మకర సంక్రాంతికి

పావన సన్నిధి చేరి

నీదు దర్శన భాగ్యము కోరీ..

ప్రతి ఏడాది మకర సంక్రాంతికి

పావన సన్నిధి చేరి

నీదు దర్శన భాగ్యము కోరీ..


పదునెనిమిది మెట్లెక్కి..

పదముల మ్రొక్కి

పరవశమవుదుము స్వామీ..

పదునెనిమిది మెట్లెక్కి..

పదముల మ్రొక్కి

పరవశమవుదుము స్వామీ..


అయ్యప్పా స్వామీ అయ్యప్పా..

అయ్యప్పా స్వామీ అయ్యప్పా

స్వామీ శరణం శరణము అయ్యప్ప

హరిహర సుతవో పావన చరిత

భక్తమందారా భవ పరిహారా

కరుణతో మమ్ము కావుము అయ్యప్ప


స్వామీ శరణం శరణము అయ్యప్పా..

స్వామీ శరణం శరణము అయ్యప్పా

హరిహర సుతవో పావన చరిత..

హరిహర సుతవో పావన చరిత

భక్తమందారా భవ పరిహారా ..

భక్తమందారా భవ పరిహారా

కరుణతో మమ్ము కావుము అయ్యప్పా..

కరుణతో మమ్ము కావుము అయ్యప్పా


స్వామీ శరణం శరణము అయ్యప్పా..

స్వామీ శరణం శరణము అయ్యప్పా

స్వామియే...  శరణం అయ్యప్పా

స్వామియే... శరణం అయ్యప్పా 


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)