ఓం కార రూపాన శబరిమల శిఖరాన పాట లిరిక్స్ | ఆవిడే శ్యామల (1997)

చిత్రం : ఆవిడే శ్యామల (1997)

సంగీతం : మాధవపెద్ది సురేష్

సాహిత్యం : డి.నారాయణ వర్మ

గానం : కె.జె.ఏసుదాస్  


ఓం కార రూపాన శబరిమల శిఖరాన

కొలువున్న అయ్యప్ప దీక్ష

ఓం కార రూపాన శబరిమల శిఖరాన

కొలువున్న అయ్యప్ప దీక్ష


శార్దూల వాహనుడు

మణికంఠ మోహనుడు

కరుణించి కావగ దీక్ష

నియమాల మాలతో దీక్ష


ఓంకార రూపాన శబరిమల శిఖరాన

కొలువున్న అయ్యప్ప దీక్ష


కామము క్రోధము లోభాలు కరిగించు

నెయ్యాభిషేకాల దీక్ష

కామము క్రోధము లోభాలు కరిగించు

నెయ్యాభిషేకాల దీక్ష

శాంత స్వభావాలు సౌఖ్యాలు కలిగించు

మండలపు పూజల దీక్ష

ఓ దర్మ శాస్త ఓ అభయ హస్త

ఇహపరము తరయించు

ముక్తి ఫల దీక్ష


స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప


అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిగా

అయ్యప్ప కనిపించు యాత్ర

అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిగా

అయ్యప్ప కనిపించు యాత్ర

పదునెనిమిది మెట్లు ఎక్కగా మొక్కగా

కోట్లాది పాదముల యాత్ర

పంబనది యాత్ర పరమాత్మ యాత్ర

ఇడుములను బాపగా ఇరుముడుల యాత్ర


స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప


ఓం కార రూపాన శబరిమల శిఖరాన

కొలువున్న అయ్యప్ప దీక్ష

శార్దూల వాహనుడు

మణికంఠ మోహనుడు

కరుణించి కావగ దీక్ష

నియమాల మాలతో దీక్ష


స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప


స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)