చిత్రం : జీవితం (1973)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : సినారె
గానం : సుశీల, రామకృష్ణ
ఇక్కడే కలుసుకొన్నాము
ఎప్పుడో కలుసుకున్నాము
ఏ జన్మలోనో... ఏ జన్మలోనో
ఎన్నెన్ని జన్మలలోనో
ఇక్కడే కలుసుకొన్నాము
ఎప్పుడో కలుసుకున్నాము
నీలనీల గగనాల మేఘ కల్పాల పైన..
పారిజాత సుమసౌరభాల కెరటాలలోన
నీలనీల గగనాల మేఘ కల్పాల పైన..
పారిజాత సుమసౌరభాల కెరటాలలోన
నీ చేయి నా పండువెన్నెల దిండుగా..
నీ రూపమే నా గుండెలో నిండగా
కలలన్నీ వడబోసి... కలలన్నీ వడబోసి..
కౌగిలిలో చవి చూసి
ఇక్కడే కలుసుకొన్నాము..
ఎప్పుడో కలుసుకున్నాము
నాటి జన్మలో ఓ చెలీ నా చరణాల వ్రాలి ఎమన్నావు?
జన్మజన్మలకు నా స్వామీ నీ చరణదాసినని అన్నాను
అంతలో నిను చేరదీసి మరి నేనేమన్నాను?
ఓ సఖీ నా ఊపిరిలో నీ వున్నావని అన్నావు
ఆనాటి అనుబంధం ఈ నాటి మనబంధం..
ఆనాటి అనుబంధం ఈ నాటి మనబంధం
ఇక్కడే కలుసుకొన్నాము...
ఎప్పుడో కలుసుకున్నాము
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon