కలకత్తా కాళివే బెజవాడ దుర్గవే పాట లిరిక్స్ | అమ్మోరు తల్లి (2002)

 చిత్రం : అమ్మోరు తల్లి (2002)

సంగీతం : దేవా

సాహిత్యం : 

గానం : చిత్ర


కలకత్తా కాళివే బెజవాడ దుర్గవే

కామాక్షి మాతవే కరుణించే తల్లివే

మా ఇంటి వేల్పువే మా కల్పవల్లివే

శరణంటూ నిలిచానే పదమంటి వేడానే

అమ్మవని తలచానే నమ్మి నిన్ను కొలిచానే

తల్లీ శాంతించు నన్నూ దీవించు

సుమంగళి వరమివ్వు మాతా

 

చూపే రవికిరణం మోమే శశివదనం

చిరునవ్వుల సిరిమువ్వల నాదం

అలివేణి స్వరవీణా నీవేలే

శివగామి అభిరామి నీవేనులే

ఓం శక్తి ఓం కారం నీవేనులే

ఈ సృష్టికాథారం నీవేనులే

జగమేలు ఓ జనని జేజేలు నీకేనులే


కలకత్తా కాళివే బెజవాడ దుర్గవే

కామాక్షి మాతవే కరుణించే తల్లివే

మా ఇంటి వేల్పువే మా కల్పవల్లివే

శరణంటూ నిలిచానే పదమంటి వేడానే

అమ్మవని తలచానే నమ్మి నిన్ను కొలిచానే అమ్మా


ప్రళయాగ్ని కీలలతో పాపుల భరతం పట్టాలమ్మా

వెన్నెలంటీ చూపులతో నీ భక్తులనే ఏలాలమ్మా

చదవాడా కామాక్షల్లే వ్యథలు మావి తీర్చాలమ్మా

ఆ మధుర మీనాక్షల్లే సిరులు నీవు కురిపించమ్మ

అరె తళతళమని మిలమిలమని

నీ కన్నులు మెరవంగ

ఫెళఫెళమని ఉరుములుగా

నువ్వు నవ్వులు రువ్వంగ

జలజలమని చినుకులుగా

నీ కరుణే కురియంగా

తకథిమి అని తాళన్నేవేయంగ

మమ్మేలే ఓ తల్లీ

అంబలినే తెచ్చామమ్మా

రుచినే చూసి మెచ్చాలమ్మా


భద్రకాళినై సింహమెక్కీ

నేను వస్తే నీ చెంతకు

భయపడీ మూర్ఛే పోరా

కలలోనైనా ఆ రూపుకు

ఎవరైనా తప్పుచేస్తే

తీర్చుకుంటా పగనే నేను

అంబనులే కోపమొస్తే

నింగినేలను ఒకటిగ చేస్తా

అరె రక్తంతో స్నానమాడె రౌద్రమూర్తి నేను

పచ్చరంగు ఒళ్ళు ఉన్న చాముండిని నేను

ఆ కపాలాల మాల ఉన్న మహంకాళి నేను

అమ్మోరుగ పోసేటీ మహమ్మారి నేను

స్మశానమే నా ఇల్లురా

ఈ లోకం నా ఊరురా

మంచి మనసే నా కోవెలరా


కలకత్తా కాళివే బెజవాడ దుర్గవే

కామాక్షి మాతవే కరుణించే తల్లివే

మా ఇంటి వేల్పువే మా కల్పవల్లివే

శరణంటూ నిలిచానే పదమంటి వేడానే

అమ్మవని తలచానే నమ్మి నిన్ను కొలిచానే 


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)