చిత్రం : సూరిగాడు (1992)
సంగీతం : వాసూరావ్
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు, చిత్ర
ఆశా.. ఆ... ఆ...
ఒకే ఒక ఆశా అదే నా శ్వాసా
ఒకే ఒక ఆశా అదే నా శ్వాసా
కమ్మని కౌగిలి కోరితే.. దురాశ
తియ్యని పెదవులు కలిపితే.. ఓ నిషా
ఒకే ఒక ఆశా అదే నా శ్వాసా
చెదిరిన పైటకు బహుమతిగా
చిలిపి ముద్దులు అందించనా
నలగని పువ్వుల నవ్వులతో
వలపు సుద్దులు నేర్పించనా
కులుకులు తగవే నా అలకల చిలకా
గడబిడ తగునా నా మగసిరి మొలకా
పరువమే ఇలా.. ఇలా.. పిలిచె మరి
ఒకే ఒక ఆశా అదే నా శ్వాసా
ఒకే ఒక ఆశా...
మదనుడు మరచిన శరములేవో
వెలికి తీసా నీ కోసమే
చల్లని వెన్నెల పల్లకిలో
ఎదురుచూసా నీ కోసమే
తరగని కలలే రా రమ్మని పిలువా
త్వరపడి ఒడిలో చోటిమ్మని అడిగా
సొగసరి సరాసరి పదవె మరి
ఒకే ఒక ఆశా అదే నా శ్వాసా
కమ్మని కౌగిలి కోరితే.. దురాశ
తియ్యని పెదవులు కలిపితే.. ఓ నిషా
ఒకే ఒక ఆశా అదే నా శ్వాసా
ఒకే ఒక ఆశా అదే నా శ్వాసా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon