చిత్రం : అంతరిక్షం (2018)
సంగీతం : ప్రశాంత్ ఆర్. విహారి
సాహిత్యం : అనంత శ్రీరాం
గానం : యాౙిన్ నిజార్, హరిణి
సమయమా...
అదేమిటంత తొందరేంటి ఆగుమా
సమయమా...
మరింత హాయి పోగు చేయనీయుమా
చేతిలోన చేతులేసుకున్న చోటులోనా
చూపుతోటి చూపులల్లుకున్న దారిలోనా
శ్వాసలోకి శ్వాస చేరుతున్న మాయలోన
ఆనంద వర్ణాల సరిగమ..
సమయమా సమయమా సమయమా
కదలకే క్షణమా..
జతపడే ఎదలలో మధురిమా
వదులుకోకే వినుమా
ఆ నింగి జాబిల్లి పై ఏ నీటి జాడున్నదో
నే చూడలేనె అపుడే ఏఏఏ..
ఈ నేల జాబిల్లి పై సంతోష భాష్పాలని
చూస్తూ ఉన్నానే ఇపుడే..ఏఏఏ..
తనే నా సగంగా తనే నా జగంగా
స్వరాల ఊయలూగుతుండగా.. ఆఅ..
ఏడేడు లోకాలు ఆరారు కాలాలు
ఆ తారా తీరాలు ఆనంద ద్వారాలు
తీసి మురిసే వేళా తీపి కురిసే వేళా
ఈ స్వప్న సత్యాన్ని దాటేసి పోనీకు
సమయమా సమయమా సమయమా
కదలకే క్షణమా..
జతపడే ఎదలలో మధురిమా
వదులుకోకే వినుమా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon