ప్రేమ జీవన నాదం పాట లిరిక్స్ | వైశాలి (1988)



చిత్రం : వైశాలి (1988)

సంగీతం : రవి

సాహిత్యం : రాజశ్రీ

గానం : చిత్ర


ప్రేమ జీవన నాదం

పంచమం ఈ వేదం

సాగాలి ఈ దినం

అనురాగ బంధం


ప్రేమ జీవన నాదం

పంచమం ఈ వేదం


తీయని భావాల రాగ సరాగ మంత్రం

విరిసెను అంతులేని ఆనందం

తలపులే రాగాలు పాడాలీ నేడు

తలపులె రాగాలు పాడాలీ నేడు


ప్రేమ జీవన నాదం

పంచమం ఈ వేదం

సాగాలి ఈ దినం

అనురాగ బంధం


ప్రేమ జీవన నాదం


స గ మ ద మ గ స

గ మ ద ని ద మ గ

మ ద ని స ని ద మ ద స


ఆడే మయూర మాల పురి విప్పి సంతసాన

మెరిసెను పూలలో గారాలీవేళ

మధువులు కురిసే పెదవుల లోనా

మధుర స్వరాలు సాగేను ఈవేళ


ఓ గండు కోయిల జత కోరి పాడిందీ

అది విని ఆడింది ఓ కన్నె కోయిల

తలపులే రాగాలు పాడాలీ నేడు

తలపులె రాగాలు పాడాలీ నేడు


ప్రేమ జీవన నాదం

పంచమం ఈ వేదం

సాగాలి ఈ దినం

అనురాగ బంధం

ప్రేమ జీవన నాదం


నక్షత్ర మాల నేడు ఆకాశ వీధిలోన

కాంతుల విరి వాన కురిపించేనులే

కలలే రగిలి అలలై కదిలి

ఊహలు నాలోన ఉరికేనులే


హంసలు జత చేరి ఆనందమున తేలి

మనసార విహరించె మధురిమలో

తలపులే రాగాలు పాడాలీ నేడు

తలపులె రాగాలు పాడాలీ నేడు


ప్రేమ జీవన నాదం

పంచమం ఈ వేదం

సాగాలి ఈ దినం

అనురాగ బంధం

ప్రేమ జీవన నాదం


తీయని భావాల రాగ సరాగ మంత్రం

విరిసెను అంతులేని ఆనందం

తలపులే రాగాలు పాడాలీ నేడు

తలపులె రాగాలు పాడాలీ నేడు


ప్రేమ జీవన నాదం

పంచమం ఈ వేదం

సాగాలి ఈ దినం

అనురాగ బంధం

ప్రేమ జీవన నాదం


Share This :



sentiment_satisfied Emoticon