మది వెలిగే ఓం శక్తి పాట లిరిక్స్ | శ్రీ రాజ రాజేశ్వరి (2001)

 చిత్రం : శ్రీ రాజ రాజేశ్వరి (2001)

సంగీతం : దేవా

సాహిత్యం : భరతి కన్నన్

గానం : చిత్ర


మది వెలిగే ఓం శక్తి

మహమాతా జయమాతా

ఉదయగిరి శ్రీకాళీ

ఉజ్జయిని మాంకాళి

కొల్లూరు మూకాంబ

కేదారం శ్రీ గౌరీ

మాయవరం అభయాంబిక


మధురలోన మీనాక్షి

కాంచిపురం కామాక్షి

కాశీ విశాలాక్షి

తిరుపతి లో గంగమ్మ

విజయవాడ దుర్గమ్మ

శృంగేరీ శారదాంబ

జగమేలే కమలాంబికా


నాగాంబ యోగాంబ

లలితాంబ జగదాంబ

బాలాంబ నీలాంబ

కనకాంబ శైలాంబ

శివకాళీ నవకాళీ

ఘనశూలీ శుభనీలి

శ్రీదేవి భూదేవీ

జయదేవి శివదేవి

ఓంకారీ ఐంకారీ

ఘ్రీంకారీ శ్రీంకారీ

క్లీం కారీ సౌకారీ

శాకారి నిరాకారీ

నా తల్లి నీవేనమ్మా

వసుధా నీ దివ్య మహిమేనమ్మా

రామలగూడెం వలువలతల్లి

తల్లి కొల్లేరు పెద్దింట్లతల్లి


పిఠాపురం పురుహూతిక

లంకలోన శంకరీ

మరిడి లోన మరిడేశ్వరీ

కాష్మీరున సరస్వతీ

గయలో మంగళ గౌరీ

ప్రయాగ లో మాధురేశ్వరి

సంతోషమొసగేటి సంతోషీ మాత

మాండువ లో శృంఖలాంబ

కౌంచనగరి చాముండి

జొన్నవాడ కామాక్షి నా తల్లీ రావే


జ్వాలాపురి వైష్ణవి

కొల్హాపురి మహాలక్ష్మి

కైలాస పార్వతి మైసూరు చాముండి

ఆలంపూరు జోగులాంబ

మహూరు ఏకవీర

ఒడ్యానం గిరిజాంబ

ద్రాక్షారం మాణిక్యాంబ

విజయనగర పైడితల్లి

కాళహస్తి యానంబ

భీమవరం లోనున్న మావూళ్ళమ్మ

పెంటపాడు పెంటమ్మ వరిగేడు దానమ్మ

తాళ్ళ పూడి అమ్మ సొమాల అమ్మ

శ్రీ శక్తి జయశక్తి శివశక్తి

నవశక్తి భవశక్తి హరిశక్తి

భైరవి శాంభవి

జంబుకేశ్వరమందు

అఖిలాండ ఈశ్వరీ

పట్టిన దెయ్యాన్ని వదిలించరావే


ఓం శక్తి ఓం శక్తి

మది వెలిగే ఓం శక్తి

ఓం శక్తి ఓం శక్తి

మము కాచే ఓం శక్తి

రా శక్తి రా శక్తి రా శక్తి

రా శక్తి కాపాడ రా శక్తి


భక్తులను కాచేటి కన్యాకుమారీ

తాడేపల్లి గూడెం మునుసూల అమ్మ

నిడదవోలు లో ఉన్న కోట సత్తెమ్మ

ఉప్పలపాడు లోని ముత్యాలమ్మ నీవే

రాయఘడ వెలసిన మత్స్య గౌరమ్మ

దుర్గాపురి వెలయు చండీ మాతల్లీ

ఆగేశ్వరి భాగేశ్వరి నాగేశ్వరి లోకేశ్వరి

శ్రీశైలం వెలసిన భ్రమరాంబిక నీవే

గౌరీశ్వరి భువనేశ్వరి జగదీశ్వరి పరమేశ్వరి

సత్యవేడులోనున్న గంగమ్మ తల్లి

రామేశ్వర నగరి పర్వత వర్ధి

కాశీ నగరానా అన్నపూర్ణ తల్లి

విశాఖపట్నాన కనకామాలక్ష్మి

ఓరుగల్లులోనా సమ్మక్క సారక్క

నా మదిలో కొలువున్న తల్లీ

నువు కోపానా శివతాండవమాడ

ఒకసారి రామ్మా..

 

ఓం శక్తి ఓం శక్తి

మది వెలిగే ఓం శక్తి

ఓం శక్తి ఓం శక్తి

మము కాచే ఓం శక్తి

రా శక్తి రా శక్తి రా శక్తి

రా శక్తి కాపాడ రా శక్తి


నెల్లూరు లో ఉన్న ఇరుగాళా అమ్మావే

అనకాపల్లి దైవం నూకాల అమ్మావే

తారామామిడిలోని గుబ్బాల అమ్మవే

కృష్ణాపురంలోని మార్లమ్మ నీవే

కావలి లో ఉన్న కలుగూళ్ళమ్మావే

రాజమండ్రిలోన సావాలమ్మావే

మాలపల్లి గూడెం కొండాలమ్మావే

పాల్వంచ లోని పెద్దమ్మ నీవే

అందరిని కాచేటి అంకాళమ్మా

గంగానమ్మా తల్లి తులసి అమ్మా

వేదపురి అమ్మావే లోకేశ్వరి అమ్మా

పమ్మేరి అమ్మావే సత్యా అమ్మా

నూకాలమ్మా ఏడు లోకాలమ్మా

అమ్మ ముగ్గురమ్మల పోలు మూలపుటమ్మ

మొక్కేము నీకమ్మ కాపాడమ్మా తల్లి

చింతామణి అమ్మా కరుణించమ్మా

మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని

ఆనంద వర్ధిని నీవేనమ్మా

అక్కమ్మ రావే జక్కమ్మ రావే

దెయ్యాన్ని పరిమార్చ మాయమ్మ రావే


ఓం శక్తి ఓం శక్తి

మది వెలిగే ఓం శక్తి

ఓం శక్తి ఓం శక్తి

మము కాచే ఓం శక్తి

రా శక్తి రా శక్తి రా శక్తి

రా శక్తి కాపాడ రా శక్తి


కులశేఖర పట్నాన ముత్యాల అమ్మావే

కుర్తాళం శక్తి పరాశక్తి తల్లీ

పాడేరులో వెలయు ఓదేకొండమ్మావే

పాలకొల్లు దైవం దేశాలమ్మావే

పోలవరం లోనా గండి పోచమ్మా

లోవలో వెలసిన తలుపులమ్మ

చినతిరపతినున్న కుంకుళ్ళ తల్లి

రేలంగిలోనున్న చినమట్ల తల్లి

దండగర్రలోని పోచాలమ్మా

ఆసాన పల్లి మారెమ్మ నీవే

కొమ్మర లోనీ పట్టలంకమ్మా

కొల్లేరు లోనున్న పెద్దింట్లమ్మ

భంభం అను నాదాలను

ఢమరుకమని నినదించగ

నాపాట వినగా వేగరా తల్లీ

మన్ను ఇక మిన్నూ

నీ కన్నుల అగ్ని రేఖ ఇక

ఏకమ్ము కావా రావా మము బ్రోవా

నా ఆశ తీరా ఆకాశ వీధి

దిగిరావే తల్లీ మమ్మే కాపాడ

తీరాలి మొక్కే కోరిక తీర

నీకన్న దిక్కూ మాకేది మాత

శోకాలను చీకాకుల్ల పోకార్చగ

నీకరుణను చేకూర్చగ అభయమ్మిడ

త్వరితన రా తల్లీ

మంచిని నయవంచన

అదిరించెను బెదిరించెను

అది తుంచగ కరుణించగ

ఇక పరుగున రా తల్లి

వరమీయుము వరమీయుము

రేణుక పరమేశ్వరి

శ్రీ రాజ రాజేశ్వరి తల్లీ

రక్కసులను నిర్జించిన

నీ శూలం చేబూనీ

భూతాలను వర్జించగా రావే మరాళి

మాయల్ని చిందాడ

మహిని నిను కొండాడ

దెయ్యాల్ని దునుమాడ

దేవతలే కొనియాడ

ఆదరమే వర్షించ

ఈ జగమే హర్షించ


రక్తాక్ష మర్ధిని రావే అమ్మ

నువ్వు రావమ్మ రావే మా పోలేరమ్మ

నువు రావమ్మా రావే మా నూకాలమ్మ

దర్శిపర్రున ఉన్న ముసలమ్మ తల్లీ

దర్శనమీవమ్మా దయలేలే తల్లి

వేడీ నిను వేడి నీ గుడిలో గుమి గూడీ

కొలిచేమూ దయ వేడి కరుణించు కాపాలి

శ్రీపతికి తోడైన శ్రీరంగ నాయకి

వరమిచ్చే మాతల్లి శ్రీ లలితాంబ

ఊరూర కొలువున్న కన్యకాపరమేశ్వరి

జిల్లేళ్ళమూడి నూకాంబిక నీవే

హస్తిని లో పోలేరమ్మ చాగల్లు పోలమ్మ

మాధవరం లోని తొడుసులమ్మా

కాపాడు ఈ పట్టి ఇక జాగు చేయక

కనక దుర్గమ్మా కదలి రావమ్మా

అన్యాయం గెలవదులే

గెలిచినాను నిలవదులే

అమ్మా నీ శక్తొకటే లోకాన్ని గెలిచేది

రావే అమ్మా రావే అమ్మా రావే అమ్మా

అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా  

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)