ఈ రాతిరి ఓ చందమామా పాట లిరిక్స్ | దొంగలకు దొంగ (1977)



చిత్రం : దొంగలకు దొంగ (1977)

సంగీతం : సత్యం

సాహిత్యం : దాశరథి

గానం : సుశీల


ఈ రాతిరి ఓ చందమామా

ఎట్లా గడిపేదీ అయ్యోరామా

ఈ రాతిరి ఓ చందమామా

ఎట్లా గడిపేదీ అయ్యోరామా

చాటుగ నను చేరి

అల్లరి పెడుతుంటే

నీతో వేగేదెలా


ఈ రాతిరి ఓ చందమామా

ఎట్లా గడిపేదీ అయ్యోరామా


వెన్నెలతో నా ఒళ్ళంతా పెనవేసేవూ

గిలిగింతలతో ఉక్కిరిబిక్కిరి చేసేవూ

ఎవరైన చూసేరు ఎగతాళి చేసేరూ

నీతో గడిపేదేలా..


ఈ రాతిరి ఓ చందమామా

ఎట్లా గడిపేదీ అయ్యోరామా


నిన్ను చూసి లేత కలువ విరిసిందీ

తెల్లవార్లూ మోటు సరసం తగదందీ

ఒకసారి ఔనంటే వదిలేది లేదంటే

ఎట్లా తాళేదిరా..


ఈ రాతిరి ఓ చందమామా

ఎట్లా గడిపేదీ అయ్యోరామా 


Share This :



sentiment_satisfied Emoticon