వెన్నెలలోనే వేడి ఏలనో పాట లిరిక్స్ | పెళ్ళినాటి ప్రమాణాలు (1959)

 చిత్రం : పెళ్ళినాటి ప్రమాణాలు (1959)

సంగీతం : ఘంటసాల

సాహిత్యం : పింగళి నాగేంద్రరావు

గానం : ఘంటసాల, పి.లీల


వెన్నెలలోనే వేడి ఏలనో

వేడిమిలోనే చల్లనేలనో

ఏమాయె ఏమో జాబిలి

ఈ మాయ ఏమో జాబిలి


వెన్నెలలోనే విరహమేలనో

విరహములోనే హాయి ఏలనో

ఏమాయె ఏమో జాబిలి

ఈ మాయ ఏమో జాబిలి


మొన్నటి కన్నా నిన్న వింతగ

నిన్నటి కన్నా నేడు వింతగ

ఓ..ఓహొ..ఓ..ఓహొ..

మొన్నటి కన్నా నిన్న వింతగ

నిన్నటి కన్నా నేడు వింతగ

నీ సొగసూ నీ వగలూ

హాయిహాయిగా వెలసేనే


వెన్నెలలోనే వేడి ఏలనో

వేడిమిలోనే చల్లనేలనో

ఏమాయె ఏమో జాబిలి

ఈ మాయ ఏమో జాబిలి


రూపము కన్నా చూపు చల్లగా

చూపుల కన్నా చెలిమి కొల్లగా

ఓహొ..ఓ..ఓహొ..ఓ..

రూపము కన్నా చూపు చల్లగా

చూపుల కన్నా చెలిమి కొల్లగా..

నీ కళలూ.. నీ హొయలు

చల్లచల్లగా విరిసేనే


వెన్నెలలోనే హాయి ఏలనో

వెన్నెలలోనే విరహమేలనో

ఏమాయె ఏమో జాబిలి

ఈ మాయ ఏమో జాబిలి

ఆ..ఆహ..ఆ..ఆ..అహ..ఆ


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)