మల్లెలతో ఆడుకునే మనసుండాలి అమ్మాయి పాట లిరిక్స్ | మమతల కోవెల (1989)

 చిత్రం : మమతల కోవెల (1989)

సంగీతం : కె.వి.మహదేవన్

సహిత్యం :

గానం : బాలు, జానకి


మల్లెలతో ఆడుకునే మనసుండాలి అమ్మాయి

వెన్నెలతో కిన్నెరలా ఆడుకో హాయిగా ప్రతిరేయి

మల్లెలతో ఆడుకునే మనసుంటే సరిపోదోయి

ఆ మనసే చెరిసగమై పాడుకో హాయిగా ప్రతిరేయి


నీ కళ్ళలోనే కౌగిళ్ళలోనే నూరేళ్ళు ఉండాలనీ హా

ఆ గుండేలోనే నీరెండలోనే నీరల్లె ఆడాలనీ

ఓ మావిళ్ల పులుపే వేవిళ్ళ వలపై

దాగుళ్ళు ఆడే లోగిళ్ల లోనా

గుడి గుడి గుంచెం గుండే రాగం పాడాలనీ


మల్లెలతో ఆడుకునే మనసుండాలి అమ్మాయి

ఆ మనసే చెరిసగమై పాడుకో హాయిగా ప్రతిరేయి


కేరింతలాడే గోరంత దీపం నా ఇంట వెలగాలనీ హో

కవ్వింతలాడే అందాల రూపం నట్టింట తిరగాలనీ

ఓ చిన్నారులాడే చిరునవ్వులన్నీ

అందాలు విరిసే హరివిల్లే ఐతే

ఆ హరివిల్లే మన పొదరిల్లై ఉండాలనీ


మల్లెలతో ఆడుకునే మనసుంటే సరిపోదోయి

ఆ మనసే చెరిసగమై పాడుకో హాయిగా ప్రతిరేయి

మల్లెలతో ఆడుకునే మనసుండాలి అమ్మాయి

వెన్నెలతో కిన్నెరలా ఆడుకో హాయిగా ప్రతిరేయి

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)