చిత్రం : మనుషులు మమతలు (1965)
సంగీతం : టి. చలపతిరావు
సాహిత్యం : దాశరధి
గానం : సుశీల
నిన్ను చూడనీ... నన్ను పాడనీ....
ఇలా వుండిపోనీ నీ చెంతనే...
నిన్ను చూడనీ....
ఈ కనులు నీకే .. ఈ కురులు నీకే
నా తనువులోని అణువు అణువు నీకే
ఈ కనులు నీకే.. ఈ కురులు నీకే
నా తనువులోని అణువు అణువు నీకే
ఇలా వుండిపోనీ నీ దాసినై..
నిన్ను చూడనీ... నన్ను పాడనీ...
నిన్ను చూడనీ...
నీవు లేని నేను.. ఇంక బ్రతకలేను
ఎన్నడైనగాని నిన్ను విడువలేను
నీవులేని నేను.. ఇంక బ్రతకలేను
ఎన్నడైనగాని నిన్ను విడువలేను
ఇలా రాలిపోనీ నీ కోసమే..
నిన్ను చూడనీ.. నన్ను పాడనీ
నిన్ను చూడనీ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon