చిత్రం : భలేతమ్ముడు (1969)
సంగీతం : టి.వి.రాజు
సాహిత్యం : డా. సి.నారాయణరెడ్డి
గానం : మహ్మద్ రఫీ, పి.సుశీల
నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే
అహహా ఆ... అహహా ఆ...
కనులముందున్న రతనాలమూర్తిని
విలువలెరుగక విసిరితిని
కనులముందున్న రతనాలమూర్తిని
విలువలెరుగక విసిరితిని
కనుల తెరచీ విలువ తెలిసి
కనుల తెరచీ విలువ తెలిసి
మనసే గుడిగా మలచితిని
నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే
మదిలో విరిసే మమతల మాలలు
చెలిమికి కానుక చేసెదను
మదిలో విరిసే మమతల మాలలు
చెలిమికి కానుక చేసెదను
ఆరని వలపుల హారతి వెలుగుల
ఆరని వలపుల హారతి వెలుగుల
కలకాలం నిను కొలిచెదను
నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే
చిలిపిగ కసిరే...
చిలిపిగ కసిరే చెలియ విసురులో
అలకలు గని నవ్వుకున్నాను అహ్హహ్హ
చేతులు సాచి చెంతకు చేరిన
చేతులు సాచి చెంతకు చేరిన
ఆ చెలినే అందుకున్నాను
ఆ చెలినే అందుకున్నాను
నేడే ఈనాడే మురిపించె నన్ను చెలి తానే
నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే
నేడే ఈనాడే మురిపించె నన్ను చెలి తానే
అహహా ఆ... అహహా ఆ... ఓహోహో..హో..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon