తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం పాట లిరిక్స్ | మాంగల్య బలం (1958)

 చిత్రం : మాంగల్య బలం (1958)

సంగీతం : మాస్టర్ వేణు

సాహిత్యం :  శ్రీశ్రీ

గానం :  సుశీల


ఆ...ఆ..ఆ...ఆ..ఆ..ఆ..


తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

పరవశమై పాడేనా హృదయం

తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం


కలకలలాడెను వసంత వనము

మైమరిపించెను మలయా నిలము


తీయని ఊహల ఊయల లూగి

తేలే మానసము... ఏమో...

తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం


రోజూ పూచే రోజా పూలు

ఒలికించినవి నవరాగాలు

ఆ...ఆ..ఆ...ఆ..ఆ..ఆ..


పరిచయమైన కోయిల పాటే

కురిసే అనురాగం... ఏమో....

తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం


అరుణ కిరణముల గిలిగింతలలో

తరగిన తెలిమంచు తెరలే తరలి

ఎరుగని వింతలు ఎదుటే నిలిచి

వెలుగే వికసించే... ఏమో...


తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం...


Share This :



sentiment_satisfied Emoticon