సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర పాట లిరిక్స్ | కంచుకోట (1961)

 చిత్రం : కంచుకోట (1961)

సంగీతం : కె.వి. మహదేవన్

సాహిత్యం : సినారె

గానం : సుశీల, జానకి


సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర

సరిలేరు నీకెవ్వరూ

సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర

సరిలేరు నీకెవ్వరూ

సురవైభవానా భాసుర కీర్తిలోనా

సురవైభవాన భాసుర కీర్తిలోనా

సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర

సరిలేరు నీకెవ్వరూ


సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా

సరిలేరు నీకెవ్వరూ

సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా

సరిలేరు నీకెవ్వరూ

సిరిలోన గానీ మగసిరిలోన గానీ

సిరిలోన గానీ మగసిరిలోన గానీ

సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా

సరిలేరు నీకెవ్వరూ


ప్రజలను నీకంటి పాపలుగా కాచి

ఆ...

ప్రజలను నీకంటి పాపలుగా కాచి

పరరాజులదరంగ కరవాలమును దూసి

ప్రజలను నీకంటి పాపలుగా కాచి

పరరాజులదరంగ కరవాలమును దూసి

శాంతిని వెలయించి మంచిని వెలిగించి

శాంతిని వెలయించి మంచిని వెలిగించి

జగతిని లాలించి పాలించినావూ....


సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర

సరిలేరు నీకెవ్వరూ


మరుడే తొందరచేయ విరిబోణులనుగూడి

మధువే పొంగులువార మనసార తూగాడి

ఆ... ఆ... ఆ...

మరుడే తొందరచేయ విరిబోణులనుగూడి

మధువే పొంగులువార మనసార తూగాడి

నవ్వులు చిలికించి మువ్వలు పలికించి

నవ్వులు చిలికించి మువ్వలు పలికించి

యవ్వనవీణనూ కవ్వించినావూ...


సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా

సరిలేరు నీకెవ్వరూ


రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్

నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్

రాజభోజ రవితేజ దానజిత కల్పభూజ జోహార్

నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్


అసమప్రభావ జోహార్

రసికావతంస జోహార్

అసమప్రభావ జోహార్

రసికావతంస జోహార్


జోహార్ జోహార్ జోహార్ జోహార్

జోహార్ జోహార్ జోహార్ జోహార్


ఆ...ఆ...

ఆ...

ఆ...


సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర

సరిలేరు నీకెవ్వరూ

సిరిలోన గానీ మగసిరిలోన గానీ

సరిలేరు నీకెవ్వరూ.....


సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకర

సరిలేరు నీకెవ్వరూ

Share This :
avatar

>> నీటుగుల్కి సుమకోటి తేనెలానేటి తేటి జోహార్
ఇది తప్పు. పాటను మరొక సారి పరిశీలించి సరిచేయండి.

delete 26 June 2021 at 07:16



sentiment_satisfied Emoticon