మనసు పలికే పాట లిరిక్స్ | స్వాతి ముత్యం (1986)

 


చిత్రం : స్వాతి ముత్యం (1986)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : సి.నారాయణ రెడ్డి

గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి


మనసు పలికే... మనసు పలికే

మౌనగీతం... మౌనగీతం

మనసు పలికే మౌనగీతం నేడే

మమతలొలికే... మమతలొలికే

స్వాతిముత్యం... స్వాతిముత్యం

మమతలొలికే స్వాతిముత్యం నీవే

అణువు అణువు ప్రణయమధువు

తనువు సుమ ధనువు

మనసు పలికే మౌనగీతం నేడే

మమతలొలికే స్వాతిముత్యం నీవే


శిరసుపైని గంగనై మరుల జలకాలాడనీ

 మరుల జలకాలాడనీ...

సగము మేను గిరిజనై పగలు రేయీ ఒదగనీ

పగలు రేయీ ఒదగనీ...

హృదయ మేళనలో మధురలాలనలో

 హృదయ మేళనలో మధురలాలనలో

వెలిగిపోనీ రాగదీపం...

వెలిగిపోనీ రాగదీపం వేయిజన్మలుగా

 

మనసు పలికే మౌనగీతం నేడే

మమతలొలికే స్వాతిముత్యం నీవే

  

కానరాని ప్రేమకే ఓనమాలు దిద్దనీ

 ఓనమాలు దిద్దనీ...

పెదవిపై నీ ముద్దునై మొదటి తీపి అద్దనీ

మొదటి తీపి...

లలితయామినిలో కలల కౌముదిలో 

 లలితయామినిలో కలల కౌముదిలో

కరిగిపోనీ కాలమంతా

కరిగిపోనీ కాలమంతా కౌగిలింతలుగా  

  

మనసు పలికే... మనసు పలికే

మౌనగీతం... మౌనగీతం

మనసు పలికే మౌనగీతం నేడే

మమతలొలికే... మమతలొలికే

స్వాతిముత్యం... స్వాతిముత్యం

మమతలొలికే స్వాతిముత్యం నీవే

అణువు అణువు ప్రణయమధువు

తనువు సుమ ధనువు

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)