చిత్రం : మహర్షి (1988)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు
సాహసం నా పథం రాజసం నా రధం
సాగితే ఆపటం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావటం కష్టమా
లోకమే బానిసై చేయదా ఊడిగం
శాసనం దాటటం శఖ్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘటన
ఈ పిడికిలిలో తానొదుగునుగా
సాహసం నా పథం రాజసం నా రధం
సాగితే ఆపటం సాధ్యమా
నిశ్చయం నిశ్చలం హహ
నిర్బయం న హయం
కానిదేముంది నే కోరుకుంటే
పూని సాధించుకోనా
లాభమేముంది కలకాలముంటే
కామితం తీరకుండా
తప్పని ఒప్పని తర్కమే చెయ్యను
కష్టమో నష్టమో లెక్కలే వెయ్యను
ఊరుకుంటే కాలమంతా
జారిపోదా ఊహవెంట
నే మనసు పడితే ఏ కలలనైనా
ఈ చిటికే కొడుతూ నే పిలువనా
సాహసం నా పథం రాజసం నా రధం
సాగితే ఆపటం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావటం కష్టమా
అధరని బెదరని ప్రవృత్తి
ఒదగని మదగజమీ మహర్షి
వేడితే లేడి ఒడి చేరుతుందా
వేట సాగాలి కాదా హహ
ఓడితే జాలి చూపేనా కాలం
కాల రాసేసిపోదా
అంతము సొంతము పంతమే వీడను
మందలో పందలా ఉండనే ఉండను
భీరువల్లే పారిపోను రేయి ఒళ్ళో దూరిపోను
నే మొదలు పెడితే ఏ సమరమైనా
నాకెదురు పడునా ఏ అపజయం
సాహసం నా పథం రాజసం నా రధం
సాగితే ఆపటం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం
కైవసం కావటం కష్టమా
లోకమే బానిసై చేయదా ఊడిగం
శాసనం దాటటం శఖ్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘటన
ఈ పిడికిలిలో తానొదుగునుగా
సాహసం నా పథం రాజసం నా రధం
సాగితే ఆపటం సాధ్యమా
తకిటజం తరితజం తనతజం జంతజం
తకిటజం తరితజం జంతజం
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon