చిన్న దూడలు వెంటనున్న పాట లిరిక్స్ | తిరుప్పావై గీతగోపాలం

 ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం

సంగీతం : వి.డి.శ్రీకాంత్

సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య

గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


చిన్న దూడలు వెంటనున్న

ఆలమందల పాలు పితుకుచు

శత్రు శేషము ఉండవలదని

చక్ర యుద్దము చేయునట్టి

పరమ హితమౌ గోపకులమున

పరిమళించిన పసిడి బొమ్మా

కనులు తెరచి కరుణ దలచి

నిదుర లెమ్మా


పుట్టలోనికి దూరు నాగిని

జఘన భాగము కలిగిన అమ్మ

అడవి నెమలుల అందమంతయు

కురుల ముడిలో ఒదిగినమ్మా

తనువు మరచి మనసు తెరచి

తలుపుతీయగా లేచిరామ్మా


బందువర్గమూ చెలుల బృందమూ

భక్తులెల్లరూ భజన చేయుచు

మంగళమ్ములు పాడినారు

ఉలక కుండా పలక కుండా ఉన్నవేమమ్మా

తెలుపు మా సంపదల తల్లి

నీ నిద్రకేమి అర్ధమమ్మా..


చిన్న దూడలు వెంటనున్న

ఆలమందల పాలు పితుకుచు

శత్రు శేషము ఉండవలదని

చక్ర యుద్దము చేయునట్టి

పరమ హితమౌ గోపకులమున

పరిమళించిన పసిడి బొమ్మా

కనులు తెరచి కరుణ దలచి

నిదుర లెమ్మా

Share This :



sentiment_satisfied Emoticon