ఏమి చోధ్యమిదే ఇంత నిద్దుర నీకు పాట లిరిక్స్ | తిరుప్పావై గీతగోపాలం

 ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం

సంగీతం : వి.డి.శ్రీకాంత్

సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య

గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


ఏమి చోధ్యమిదే ఇంత నిద్దుర నీకు

కామ జనకుని ఒడిలో కరిగిపోబోకు

ఏమి చోధ్యమిదే ఇంత నిద్దుర నీకు

కామ జనకుని ఒడిలో కరిగిపోబోకు


నేలనంటు పొదుగులతో పాలు పితుకు వారు లేరని

చిన్న దూడలు తలచి అరచి గంతులిడుచు వచ్చెననుకొని

అనురాగముప్పొంగి మనసు కరిగి పొదుగు పొంగి పొంగి

పాల ధార ప్రవాహంబు పంకిలమ్మైపోయె వాకిలి


పశు సంపద కలవాని పరమ సాధ్వి చెల్లెలా

నెత్తి పైన మంచుకురవ ముత్తడైనా వరదలా

బొత్తిగ తలదాచ లేక చూరు క్రింద నిలచి నిలచి

చిత్తమున శ్రీగోప దేవుని చేర్చుకొమ్మను వేళా


గొంతు చించి వేడుకొన్న గొంతు విప్పవేమిటమ్మా

వింత వార్తలు ఎపుడో ఈ ఊరంతా ప్రాకి పోయేనమ్మా

లెమ్ము పూల పాన్పునొదిలి ధర్మము కాపాడవమ్మా

ఇమ్మహి నిధులెన్ని ఉన్నా ఎందుకు కొరగావు లెమ్మా


ఏమి చోధ్యమిదే ఇంత నిద్దుర నీకు

కామ జనకుని ఒడిలో కరిగిపోబోకు

ఏమి చోధ్యమిదే ఇంత నిద్దుర నీకు

కామ జనకుని ఒడిలో కరిగిపోబోకు


Share This :



sentiment_satisfied Emoticon