లే లే లేలే ఇవ్వాళే లేలే పాట లిరిక్స్ | గుడుంబా శంకర్ (2004)



చిత్రం : గుడుంబా శంకర్ (2004)

రచన : చంద్రబోస్

సంగీతం : మణిశర్మ

గానం : కె.కె.


లే లే లేలే ఇవ్వాళే లేలే

లే లే లేలే ఈరోజల్లే లేలే

వీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లే

రెండంటే రెండున్నాయి బాటలే

ఔనంటే ఆకల్లే లేకుంటే బాకల్లే

ఉంటేనే పోతుంటాయి బాధలే


లే లే లేలే ఇవ్వాళే లేలే

లే లే లేలే ఈరోజల్లే లేలే

 

చిరుగాలై నువ్వుండాలి నిన్నే కవ్విస్తుంటే

సుడిగాలై చుట్టేయాలి లేలే

గొడుగల్లే పనిచెయ్యాలి నిన్నే కదిలిస్తుంటే

పడగల్లే పనిపట్టాలి లేలే

నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి

నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి

అణిచేస్తే ముంచెయ్యాలి లే

నేలల్లే ఉండాలి అందరి భారం మోయాలి

విసిగిస్తే భూకంపాలే చూపాలే...


లే లే లేలే ఇవ్వాళే లేలే

లే లే లేలే ఈరోజల్లే లేలే


చెడు ఉంది మంచి ఉంది అర్థం వేరే ఉంది

చెడ్డోళ్లకి చెడు చేయడమే మంచి

చేదుంది తీపి ఉంది భేదం వేరే ఉంది

చేదన్నది ఉన్నపుడేగా తీపి

ఎడముంది కుడివుంది

కుడి ఎడమయ్యే గొడవుంది

ఎడముంది కుడివుంది

కుడి ఎడమయ్యే గొడవుంది

ఎటుకైనా గమ్యం ఒకటేలే

బ్రతుకుంది చావుంది

చచ్చేదాకా బ్రతుకుంది

చచ్చాకా బ్రతికేలాగ బ్రతకాలే


లే లే లేలే ఇవ్వాళే లేలే

లే లే లేలే ఈరోజల్లే లేలే

వీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లే

రెండంటే రెండున్నాయి బాటలే

ఔనంటే ఆకల్లే లేకుంటే బాకల్లే

ఉంటేనే పోతుంటాయి బాధలే

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)