ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి
వన్నెలాడి కన్నుదెరచి వచ్చేయవా
నిన్ను ఎంత పిలిచినా నిదుర లేవవా
వన్నెలాడి కన్నుదెరచి వచ్చేయవా
నిన్ను ఎంత పిలిచినా నిదుర లేవవా
బలమున్న బకాసురుని గళము చీల్చి పొగడినా
అలి వేణులకాప్తుడైన ఆ కృష్ణుని వీడినా
పది తలలా రావణుని పల్లవమ్ముగా దృంచిన
పదుగురు శ్రీరాముని మది పాడుచు వచ్చినా
వన్నెలాడి కన్నుదెరచి వచ్చేయవా
నిన్ను ఎంత పిలిచినా నిదుర లేవవా
వనితలంత వలపులొలుక
వ్రత క్షేత్రమింపులొలుక
వయ్యారము చిందులాడ
వేయి పేర్లు పెట్టి పిలువ
వన్నెలాడి కన్నుదెరచి వచ్చేయవా
నిన్ను ఎంత పిలిచినా నిదుర లేవవా
కమలాల కన్న మిన్న కన్నులు గలదానా
రమణీయ హరిణి కన్న రమ్య దృక్కులున్నదాన
తూరుపున శుక్రుడెదిగి పడమట గురువొదిగే
వేరు వేరు రవళులు విహంగములు వినిపించిన
వన్నెలాడి కన్నుదెరచి వచ్చేయవా
నిన్ను ఎంత పిలిచినా నిదుర లేవవా
నల్లనయ్య ఒడిలో నలిగి అన్ని విస్మరించి
తెల్లవార్లు పాన్పుపైన కేళిలోన పరవశించి
చల్లనైన నీటిలోన జలకమాడి మా వెంట
ఉల్లములో హరిని నిల్పి వ్రతము చేయరమ్మంటే
వన్నెలాడి కన్నుదెరచి వచ్చేయవా
నిన్ను ఎంత పిలిచినా నిదుర లేవవా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon