నేనే నేనా వేరే ఎవరోనా పాట లిరిక్స్ | ఓ బేబి (2019)

 చిత్రం : ఓ బేబి (2019)

సంగీతం : మిక్కీ జె మేయర్ 

సాహిత్యం : భాస్కరభట్ల 

గానం : నూతన మోహన్ 


With The Rhythm In Your Feet

And The Music In The Soul

Lift Your Hands To The Sky

And Say Ganesha


He's Your Friend When You Need

He's The Magic In Your Beat 

Lift Your Hands To The Sky

And Say Ganesha


నేనే నేనా వేరే ఎవరోనా

నేనే ఉన్నా సందేహం లోనా

నా ఎండమావి దారుల్లో నవ్వులు పూసే

నా రెండు కళ్ల వీధుల్లో వెన్నెల కాసే

నా గుండె చూడు తొలిసారి గంతులు వేసే

ఆ నిన్నల్లో మొన్నల్లో కలలన్నీ సడిచేసే


చాంగుభళా చాంగుభళా చాంగుభళా ఇలాగా

నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా

చాంగుభళా చాంగుభళా చాంగుభళా ఇలాగా

నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా

యవ్వనమే తుర్రుమనీ పారిపోయే తూనీగా

తిరిగి వచ్చే నిజంగా


నేనే నేనా వేరే ఎవరోనా

నేనే ఉన్నా సందేహం లోనా


ఇంత గొప్పగుంటుందా జీవితం?

ఇంద్రధనసు మెరిసినట్టుగా

తిరిగి వచ్చి చేరుకుంటే నా గతం

తెలుసుకుంటోంది మనసేమో మెల్లమెల్లగా

ఊహలన్నీ కిలకిలమంటూ

ఎగురుతున్నాయి సంకెళ్లు తెగినట్టుగా

గుండెపాట గొంతుని దాటి పెదవుల తీగలపై

మోగెనుగా ఎన్నెన్నో స్వరాలుగా


చాంగుభళా చాంగుభళా చాంగుభళా ఇలాగా

నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా

చాంగుభళా చాంగుభళా చాంగుభళా ఇలాగా

నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా

యవ్వనమే తుర్రుమనీ పారిపోయే తూనీగా

తిరిగి వచ్చే నిజంగా


లోకమంత కొత్తకొత్తగుందిగా

పూల చెట్టు దులిపినట్టుగా

ఈ క్షణాల్ని పట్టుకుంట గట్టిగా

తల్లి వెళుతుంటే ఆపేసే పసిపాపలా

తీరిపోని సరదాలన్నీ

తనివి తీరేలా తీర్చేసుకోవాలికా

ఆశలన్నీ దోసిట నింపి 

సీతాకోకలుగా వదిలేస్తే

ఆనందం వేరు కదా


చాంగుభళా చాంగుభళా చాంగుభళా ఇలాగా

నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా

చాంగుభళా చాంగుభళా చాంగుభళా ఇలాగా

నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా

యవ్వనమే తుర్రుమనీ పారిపోయే తూనీగా

తిరిగి వచ్చే నిజంగా


With The Rhythm In Your Feet

And The Music In The Soul

Lift Your Hands To The Sky

And Say Ganesha


He's Your Friend When You Need

He's The Magic In Your Beat 

Lift Your Hands To The Sky

And Say Ganesha 

 


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)